News

టిఆర్ఎస్ పార్టీది దురహంకారం


తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు పెట్టడం ప్రభుత్వ దురహంకారమని తెలుగుదేశం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ విమర్శించారు.గతంలో అర్దరాత్రి వరకు ర్యాలీలు నిర్వహించినవారు ఉన్నారని,వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని, కాని తమపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.హైదరాబాద్ ను బ్రహ్మాండంగా అబివృద్ది చేస్తామని చెబుతున్నవారు చేతలలో చూస్తే శూన్యమని ఆయన విమర్శించారు . కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు.ర్యాలీలో కేసులు పెట్టిన తీరును ఆయన ఖండించారు. యాదగిరి ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రమాణానికి సిద్దమా అని ప్రశ్నించారు.కాగా జూబ్లిహిల్స్ టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ మాట్లాడుతూ ముస్లింలకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు.